Mohsin Naqvi : పాక్ టీమ్‌కు చుక్కలు చూపించిన ఇండియన్ కుర్రాళ్లు..మొహమ్మద్ నఖ్వీకి ఎందుకు అంత మంట?
Mohsin Naqvi : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమిండియా కుర్రాళ్లు తమ ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించకూడదని హితవు పలికిన ఆయన,

Mohsin Naqvi : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమిండియా కుర్రాళ్లు తమ ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించకూడదని హితవు పలికిన ఆయన, ఈ విషయాన్ని అధికారికంగా ఐసీసీకి నివేదిస్తామని చెప్పారు. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లోపించిందని నఖ్వీ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సర్ఫరాజ్ అహ్మద్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ అండర్-19 జట్టు మెంటార్‌గా వ్యవహరించిన సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా భారత్‌పై విమర్శలు గుప్పించారు. భారత్ ప్రవర్తన క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాము విజయం సాధించినా హుందాగా సెలబ్రేట్ చేసుకున్నామని, కానీ భారత ప్లేయర్లు మాత్రం కనీస మర్యాద పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆసియా కప్ గెలిచినప్పుడు కూడా భారత జట్టు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిందని గుర్తు చేశారు.
షేక్ హ్యాండ్ ఇవ్వని కుర్రాళ్లు
ఈ వివాదానికి ప్రధాన కారణం మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కనీసం హ్యాండ్ షేక్ చేయకపోవడమే. సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీని ప్రభావం క్రీడలపై స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం గతంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అదే బాటలో జూనియర్ టీమ్ కూడా పయనించడం పాక్ బోర్డుకు మింగుడుపడటం లేదు.
ఫైనల్లో పాక్ పైచేయి
దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. పాకిస్థాన్ నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. 191 పరుగుల భారీ తేడాతో పాక్ కప్పును ఎగరేసుకుపోయింది. లీగ్ దశలో పాక్‌ను ఓడించిన భారత్, అత్యంత కీలకమైన ఫైనల్లో మాత్రం ఒత్తిడికి చిత్తయింది. అయితే ఓటమి కంటే కూడా ఇరు జట్ల మధ్య నెలకొన్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




