AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు! తిరుమలలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? పాన్ ఇండియా ఫేమస్

ఈ నటుడు తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు. విలన్ గా, సహాయక నటుడిగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోగానూ మెప్పించాడు. ఈ మధ్యన పెద్దగా బయట కనిపించని ఈ నటుడు సడెన్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు! తిరుమలలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? పాన్ ఇండియా ఫేమస్
Actor Dev Gill
Basha Shek
|

Updated on: Feb 16, 2026 | 6:21 PM

Share

ఎప్పటిలాగానే సోమవారం (ఫిబ్రవరి 16) కూడా వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఏడు కొండల వాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలా సోమవారం శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖుల జాబితాలో ఒక ప్రముఖ నటుడు కూడా ఉన్నాడు. గత రెండేళ్లుగా వెండితెరపై కనిపించని ఈ నటుడు సడెన్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నాడు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నాడు. అయితే తలనీలాలు సమర్పించుకుని బయటకు వచ్చిన ఈ నటుడిని చూసి మొదట చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరి పై ఫొటోలో గుండుతో ఉన్న ఈ నటుడిని గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు మగధీర మూవీ విలన్ దేవ్ గిల్.

మహారాష్ట్రకు చెందిన దేవ్ గిల్ 2002లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట హిందీ చిత్రాల్లో నటించాడు. ఆతర్వాత 2008లో కృష్ణార్జున అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మరుసటి ఏడాది విడుదలైన మగధీర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో అతను పోషించిన రణ్ దేవ్ బిల్లా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీని తరవాత రగడ, ప్రేమ కావాలి, పూల రంగడు, రచ్చ, నాయక్, అడ్డా, లింగా, ఇంటెలిజెంట్ తదితర సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో నటుడు దేవ్ గిల్..

తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసిన దేవ్ గిల్ హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. 2024లో రిలీజైన తెలుగు సినిమా అహో విక్రమార్కలో హీరోగా నటించాడీ విలన్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ హీరోగా దేవ్ గిల్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ నటుడ ఘార్గా అనే తెలుగు మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు వివిధ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు దేవ్ గిల్.

మహా శివరాత్రి వేడుకల్లో ఫ్యామిలీతో కలిసి పూజలు చేస్తూ..

View this post on Instagram

A post shared by Dev Gill (@actordevgill)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us