AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 1 నుంచి స్టార్ట్.. రూట్ ఇదే..

Amrit Bharat Express: ఏపీ, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు సర్వీసులు అందించనున్న అమృత్ భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ మార్చి 1న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 1 నుంచి స్టార్ట్.. రూట్ ఇదే..
Amrit Bharat Express
Venkatrao Lella
|

Updated on: Feb 25, 2026 | 9:52 PM

Share

తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. మార్చి 1వ తేదీన తమిళనాడులోని మధురై వేదికగా నాలుగు కొత్త రైలు సర్వీసులను ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. మంగళూరు సెంట్రల్-రామేశ్వరం-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తాంబరం- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్-ధనాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.

కొత్త స్టేషన్లు ప్రారంభం

అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్తగా అభివృద్ది చేసిన 8 స్టేషన్లను మోదీ మార్చి 1వ తేదీన మధురై నుంచి జాతికి అంకితం చేయనున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి ఈ రైళ్లను మోదీ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రైళ్ల టైం షెడ్యూల్, రూట్, ఏయే స్టేషన్లలో ఆగుతాయనే దానిపై రైల్వేశాఖ ఇంకా వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రైల్వేశాఖ ప్రకటించే అవకాశముంది. తాంబరం-మంగళూరు AB ఎక్స్‌ప్రెస్‌ మంగళూరు జంక్షన్ నుండి వారానికోసారి సర్వీసులు అందించనుంది.

చర్లపల్లి నుంచి అమృత్ భారత్

గత నెల జనవరి 27వ తేదీన చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తర్వాతి రోజు 14.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఎగ్మోర్, తిరూచీ, మధురై, కొల్లం స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తోండగా.. ఇప్పుడు మరో ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..
కుండ చికెన్ ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు
కుండ చికెన్ ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు