AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robert Kiyosaki: బంగారం ఖరీదైంది కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్‌..!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బంగారం ధరల వెనుక అసలు కారణం బంగారం ఖరీదవడం కాదని, డాలర్‌ విలువ తగ్గిపోవడమేనని ప్రముఖ రచయిత రాబర్ట్‌ కియోసాకి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం వల్ల కరెన్సీ కొనుగోలు శక్తి క్షీణిస్తోందని, డాలర్ల కంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, రియల్‌ అసెట్స్‌లో పెట్టుబడులు మంచివని ఆయన సూచించారు.

Robert Kiyosaki: బంగారం ఖరీదైంది కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్‌..!
Robert Kiyosaki
SN Pasha
|

Updated on: May 29, 2026 | 5:15 PM

Share

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్‌ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డాలర్‌ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులో “బంగారం ఖరీదవడం లేదు.. డాలర్‌ చవకబారుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రజలు బంగారం ధరలు పెరుగుతున్నాయని భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి అమెరికన్‌ డాలర్‌ కొనుగోలు శక్తి తగ్గిపోవడమే అసలు సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

కియోసాకి ప్రకారం చాలా మంది జీతాలు పెరిగాయని భావిస్తున్నా, నిజానికి కరెన్సీ విలువ పడిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయే తప్ప సంపద పెరగడం లేదన్నారు. ఈ విషయాన్ని వివరించేందుకు తన స్నేహితుడి కుటుంబాన్ని ఉదాహరణగా చెప్పారు. ఒకప్పుడు 10 వేల డాలర్లకు కొనుగోలు చేసిన ఇల్లు నేడు 7.5 లక్షల డాలర్ల విలువకు చేరిందని, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ మాత్రం ఇప్పటికీ అదే విలువలో ఉందని వివరించారు. “ఒక ఆస్తి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.

1971 నుంచి అమెరికన్‌ డాలర్‌ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బు ముద్రించడం వల్ల కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతుందని, ఇది చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల పతనానికి కారణమైందని చెప్పారు. కోవిడ్‌ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని కూడా గుర్తుచేశారు. డాలర్‌ను నిజమైన డబ్బుగా కాకుండా ప్రతి ఏడాది విలువ కోల్పోతున్న ఒక కొలమానంగా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్‌ కరెన్సీలు మాత్రం కాలక్రమంలో బలహీనపడతాయని అన్నారు. అందుకే డాలర్లను దాచుకోవడం కంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, భూమి వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు.

Follow Us
బంగారం ఖరీదైంది కాదా? అలా ఎలా సార్‌?
బంగారం ఖరీదైంది కాదా? అలా ఎలా సార్‌?
పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి
పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి
ఇలా చెట్లకు రంగు ఎందుకు వేస్తారో తెలుసా..?
ఇలా చెట్లకు రంగు ఎందుకు వేస్తారో తెలుసా..?
మనీ ప్లాంట్ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో అప్పుల బాధలేనా? ఇలా చేయండి!
మనీ ప్లాంట్ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో అప్పుల బాధలేనా? ఇలా చేయండి!
సమ్మరో అబ్బాయిలు తాగాల్సిన పానీయం.. అలాంటి ఒత్తిడి నుంచి ఈజీగా..
సమ్మరో అబ్బాయిలు తాగాల్సిన పానీయం.. అలాంటి ఒత్తిడి నుంచి ఈజీగా..
టచ్ చేస్తే చావే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి..
టచ్ చేస్తే చావే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి..
అరుదైన ఖగోళ వింత,హైదరాబాద్‌లోనూ కనువిందు చేయనున్న బ్లూ మైక్రోమూన్
అరుదైన ఖగోళ వింత,హైదరాబాద్‌లోనూ కనువిందు చేయనున్న బ్లూ మైక్రోమూన్
ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్
ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్
గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ 5 ఓవర్లే
గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ 5 ఓవర్లే
శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు
శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు