AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: నిమిషాల్లోనే పాన్ కార్డులో ఫొటో మార్చుకోవచ్చు..? ఈ స్టెప్స్ ఫాలో అయితే మరింత సులువు..

మీ దగ్గర పాన్ కార్డు ఉందా..? అందులో పాత ఫొటో ఉందా..? ఫొటో మార్చుకోవాలని అనుకుంటున్నారా..? ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సులభంగా ఫొటోను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.

Pan Card: నిమిషాల్లోనే పాన్ కార్డులో ఫొటో మార్చుకోవచ్చు..? ఈ స్టెప్స్ ఫాలో అయితే మరింత సులువు..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jun 19, 2026 | 10:58 AM

Share

దేశంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన గుర్తింపు ధృవీకరణ పత్రాలలో ఒకటి ఆధార్ కార్డు అయితే.. రెండోది పాన్ కార్డ్ అని చెప్పవచ్చు. ఈ రెండు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్‌. ఈ రెండూ ప్రత్యేక అవసరాలను తీర్చుతుంది. ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగపడితే.. పాన్ బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఆధార్, పాన్ కార్డు దేనికది ప్రత్యేకతను కలిగి ఉంది. పాన్ కార్డ్ లేకుండా మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు  దేశంలో చేయలేరు. అందుకే ప్రతీఒక్కరూ పాన్ కార్డు అనేది కలిగి ఉంటారు. చిన్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ అవకాశం కల్పిస్తోంది.

ఫొటోను సులభంగా మార్చుకోవచ్చు

మీ ఆదాయం, పన్నులు, మీరు చేసే ఖర్చులకు సంబంధించిన ప్రతీ సమాచారం పాన్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాన్ కార్డులోని వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. వివరాల్లో తేడాలు ఉంటే మీరు చాలా సేవలు పొందలేరు. ధృవీకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా పాన్ కార్డుపై పాత ఫొటో ప్రింట్ అయి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది మీ రూపంలో మార్పులు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఆ ఫోటో మీ అసలు రూపానికి సరిపోలకపోతే సమస్యలు తలెత్తవచ్చు. అదే ఫొటోను మార్చుకోవడం ఎలా ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

ఫొటోను మార్చుకోవడం ఎలా..?

– NSDL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి

-అవసరమైన సమాచారాన్ని ఇక్కడ పూరించాలి

-పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి

– క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి

-కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయండి

– అనంతరం ఫోటో మార్చే ఆప్షన్‌ను ఎంచుకోండి

-చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయండి

– ‘డిక్లరేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-రూ.101 ఫీజు చెల్లించండి

-నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు

-15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది

– ఈ నంబర్‌ను ఆదాయపు పన్ను పాన్ సేవా విభాగానికి పంపండి

-అనంతరం మీ పాన్ కార్డుపై మీ ఫోటో అప్‌డేట్ అవుతుంది

పాన్ కార్డు FAQ’s

ప్రశ్న: పాన్ కార్డు ఎవరు జారీ చేస్తారు..?

జావాబు: ఆదాయపు పన్ను శాఖ

ప్రశ్న: పాన్ కార్డు ఫొటో మార్చుకోవడం ఎలా..?

జవాబు: NSDL వెబ్‌సైట్ లేదా పాన్ కార్డు ఆఫీసుల ద్వారా మార్చుకోవచ్చు

ప్రశ్న: పాన్ కార్డులో ఫొటో మార్చుకునేందుకు ఫీజు ఎంత..?

జవాబు: రూ.101 రుసం చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!