AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: కరివేపాకుతో బరువు తగ్గడం ఎలాగో తెలుసా..? ఇలా తీసుకుంటే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల పద్ధతులు ప్రయత్నిస్తున్నాయి. అయితే మన వంటింట్లో దొరికే ఒక పదార్థంతో ఈజీగా బరువు తగ్గొచ్చని తెలుసా..? అవును.. మన వంటకాల్లో కరివేపాకు లేని కూరను అస్సలు ఊహించలేం. కేవలం సువాసన, రుచి కోసమే కాకుండా ఆరోగ్య సంరక్షణలో కూడా కరివేపాకు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jun 18, 2026 | 4:35 PM

Share
జీర్ణక్రియ మెరుగు: కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ జీర్ణాశయాల పనితీరును ఈజీగా మారుస్తాయి. ఇది మన శరీరంలోని కొవ్వు ఆమ్లాలను విచ్ఛిన్నం చేసి, అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, విటమిన్ బి శరీర జీవక్రియను పెంచడం వల్ల ఎక్కువ కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. సరైన జీర్ణక్రియే బరువు తగ్గడానికి మొదటి మెట్టు అనేది అందరూ తప్పక గుర్తుంచుకోవాలి.

1 / 5
బ్లడ్ షుగర్ కంట్రోల్: శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ప్రత్యేక సామర్థ్యం కరివేపాకుకు ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేస్తుంది. కాబట్టి చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడం వల్ల ఊబకాయం, షుగర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకు ఆకులను నమలడం వల్ల పదే పదే తినాలనే అధిక ఆకలి నియంత్రణలోకి వస్తుంది.

2 / 5
విషపదార్థాల తొలగింపు: శరీరంలో హానికరమైన టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల కూడా బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, పొట్ట చుట్టూ కొవ్వు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు ఈ విషపదార్థాలను బయటకు పంపి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఆహారంలో కరివేపాకును తప్పక ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా రివేపాకులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

3 / 5
ఎలా ఉపయోగించాలి?: కరివేపాకును నీటిలో బాగా మరిగించి, వడకట్టి ఉదయాన్నే టీ లాగా తాగడం వల్ల షుగర్ పేషెంట్లలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా బరువు త్వరగా తగ్గుతారు. మీ రోజువారీ కూరలు, చట్నీలు, ఇతర వంటకాలలో కరివేపాకును తీసి పక్కన పెట్టకుండా పుష్కలంగా నమిలి తినేయండి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల చర్మ అలర్జీలు, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

4 / 5
బరువు తగ్గడానికి కరివేపాకు ఒక గొప్ప సహజ మార్గం అయినప్పటికీ.. కేవలం దీనివల్లే బరువు తగ్గిపోరు. దీనితో పాటు సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరం. కరివేపాకును అతిగా తీసుకోకూడదు. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకున్న తర్వాతే ఈ అలవాటును ప్రారంభించాలి.

5 / 5
Follow Us
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..

సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్

ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!

రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు!

మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..

రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..

శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..

చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...

పచ్చి కొబ్బరి తినే అలావాటు మీకుందా..? అయితే, ఇది మీ కోసమే..!