AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైప్ సీ ఛార్జర్‌లో C అంటే ఏంటో తెలుసా..? 99శాతం మందికి తెలియని ఆసక్తికరమైన నిజం ఇదే..

ఈ రోజుల్లో చిన్నపిల్లల బొమ్మల దగ్గరి నుంచి స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల వరకు అన్నింటికీ టైప్ సి ఛార్జరే వాడుతున్నాం. రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా మనం ఈ కేబుల్‌ను చేత్తో పట్టుకుంటాం. కానీ అసలు ఈ టైప్ సి ఛార్జర్‌లో ఉండే C కి అర్థం ఏంటో మీకు తెలుసా? చాలామంది దీనికి పెద్ద ఫుల్ ఫామ్ ఉంటుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకుందాం..

టైప్ సీ ఛార్జర్‌లో C అంటే ఏంటో తెలుసా..? 99శాతం మందికి తెలియని ఆసక్తికరమైన నిజం ఇదే..
What Does The C In Type C Charger Actually Mean
Krishna S
|

Updated on: Jun 18, 2026 | 5:10 PM

Share

గతంలో ఫోన్ ఛార్జర్ అంటే సన్న పిన్ ఛార్జర్లే ఎక్కువగా కనిపించేవి. ఆ తర్వాత రకరకాల రూపాంతరం చెంది ఇప్పుడు టైప్ సీకి వచ్చాయి. ఈ టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్, టాబ్లెట్, చివరికి చిన్నపిల్లల బొమ్మల వరకు దేనికి ఛార్జింగ్ కావాలన్నా టైప్ సి ఛార్జర్లే. మనం ప్రతిరోజూ ఈ టైప్ సి కేబుల్స్‌ను వాడుతుంటాం. అయితే అసలు ఈ టైప్ సి చార్జర్‌లో ఉండే C కి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది దీనికి ఏదో ఒక పెద్ద ఫుల్ ఫామ్ టుందని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం వేరే. టైప్ సి లోని C అనే అక్షరానికి ఎలాంటి ఫుల్ ఫామ్ లేదు. నిజానికి ఇది ఛార్జింగ్ టెక్నాలజీలో వచ్చిన మూడవ తరం జనరేషన్. దీనికంటే ముందు మొదటి జనరేషన్‌ను టైప్ ఏ అని, రెండవ జనరేషన్‌ను టైప్ బి అని పిలిచేవారు. ఆ క్రమంలోనే మూడవ తరం టెక్నాలజీకి టైప్ సి అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ ఛార్జర్ కనెక్టర్ పిన్ ఆకారం కూడా ఇంగ్లీష్ అక్షరం C ని పోలి ఉంటుంది.

పాత ఛార్జర్ల పెద్ద సమస్యకు పరిష్కారం

గతంలో వాడిన టైప్ ఏ, టైప్ బి ఛార్జర్లలో ఒక పెద్ద తలనొప్పి ఉండేది. వాటిని కరెక్ట్ వైపు చూసి మాత్రమే పోర్టులో పెట్టాల్సి వచ్చేది. పొరపాటున తిరగతిప్పి పెడితే ఫోన్ పోర్టు లేదా కేబుల్ పాడైపోయేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు టైప్ సి ని డిజైన్ చేశారు. దీనిని ఎటువైపు తిప్పి పెట్టినా ఛార్జింగ్ అవుతుంది. ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన లైట్నింగ్ కేబుల్ స్ఫూర్తితో దీనిని మరింత మెరుగుపరిచారు.

కేవలం చార్జింగ్ మాత్రమే కాదు.. అంతకు మించి..

టైప్ సి కేబుల్ కేవలం ఫోన్ ఛార్జ్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు. పాత టెక్నాలజీతో పోలిస్తే ఇది అత్యంత వేగంగా పవర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలాగే దీని డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ చాలా ఎక్కువ. ఇది సెకనుకు 10 Gbps లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఫైల్స్‌ను బదిలీ చేస్తుంది. దీని సాయంతో స్మార్ట్‌ఫోన్లను నేరుగా టీవీలు, మానిటర్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.

టైప్ డి వస్తుందా?

రాబోయే రోజుల్లో టైప్ సి ని మించి టైప్ డి వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే చాలా తక్కువ. ఎందుకంటే.. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు టైప్ సి చార్జర్‌ను ఒకే ఒక యూనివర్సల్ ఛార్జర్‌గా మారుస్తూ చట్టం తెచ్చింది. పైగా టైప్ సి ఆకారం అలాగే ఉంచుతూనే, లోపల దాని వేగాన్ని, ఫీచర్లను శాస్త్రవేత్తలు నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో చాలా కాలం పాటు ఈ టైప్ సి టెక్నాలజీనే రాజ్యమేలతుంది.

Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ