AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.. నేరుగా మీ ఇంటి వద్దకే సేవలు.. ఈపీఎఫ్‌వో అద్బుత అవకాశం

ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతున్నవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికేట్ అందించడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు కొత్త అవకాశం అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే.. పెన్షన్‌దారులు ఇంటి నుంచే సులువుగా లైఫ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవచ్చు.

EPFO: రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.. నేరుగా మీ ఇంటి వద్దకే సేవలు.. ఈపీఎఫ్‌వో అద్బుత అవకాశం
Epfo
Venkatrao Lella
|

Updated on: May 29, 2026 | 4:00 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. అందులో ఒకటి పెన్షన్ సౌకర్యం. ఈపీఎఫ్‌లో 10 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తి చేసినవారికి కేంద్రం రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తోంది. ఈపీఎస్-95 పథకం ద్వారా వీటిని అందిస్తోంది. అయితే పెన్షన్ పరిధిలో ఉన్నవారు ప్రతీ ఏడాది తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది అందించకపోతే నెలనెలా వచ్చే పెన్షన్ ఆగిపోయే ప్రమాదముంటుంది. దీంతో సాంకేతిక కారణాలతో చాలామంది జీవన ప్రమాణ పత్రం అందించలేకపోతున్నారు. దీంతో తమ పెన్షన్ ఎక్కడ ఆగిపోతుందేమోనని భయపడుతున్నారు. ఇలాంటి వారికి ఊరట కలిగిస్తూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

పోస్టాఫీసుల ద్వారా ఉచితంగా..

ఈపీఎస్ కింద పెన్షన్ పొందుతున్నవారికి కేంద్రం కీలక సూచనలు తాజాగా జారీ చేసింది. పోస్టాఫీసుల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఈ సదుపాయం వల్ల వేగంగా జీవన ప్రమాణ పత్రం అందించవచ్చు. ఈ సర్టిఫికేట్ అందిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ ఏడాది పెన్షన్ అందుతుంది. ఇక ఆన్ లైన్ విధానంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయినా సులువుగా అందించవచ్చు. బయోమెట్రిక్ ఎనేబుల్ ఆధార్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికేట్‌గా దీనిని చెబుతారు. ఈ సర్టిఫికేట్ సమర్పిస్తే పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లు పరిగణిస్తారు. దీని వల్ల పెన్షన్ పొందటంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఈ పత్రం సులభంగా సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో పోస్టాఫీసుల ద్వారా అవకాశం కల్పిస్తోంది.

ఈ నెంబర్‌కు కాల్ చేస్తే..

033-22029000 నెంబర్‌కు పెన్షన్‌దారుడు ఫోన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పోస్టల్ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సహాయం అందిస్తారు. మీరు ఈ సేవల కోసం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. పోస్టల్ సిబ్బంది ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్‌లో ఈపీఎఫ్‌వో పొందుపర్చింది.  ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి నెలకు రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.7 వేలకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలిస్తోంది. అయితే నెలకకు రూ.15 వేలలోపు బేసిక్ శాలరీ ఉన్నవారు ఈపీఎస్ పరిధిలోకి వస్తారు. కంపెనీ కాంట్రిబ్యూషన్ నుంచి 8.33 శాతం ఈపీఎస్‌ అకౌంట్లోకి వెళుతుంది.

Follow Us