మహారాష్ట్రలో రుణమాఫీ ప్రయోజనం అందకపోవడంతో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఎద్దుపై ఎక్కి.. నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. తనకు రుణమాఫీ అమలు చేయాలని నినాదాలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.