ఆన్‌లైన్ గేమింగ్‌కు కొత్త రూల్స్.. అలా చేస్తే జైలుకే
Venkatrao Lella
Images: Pinterest
25 June 2026
ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025’ అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా కఠిన నిబంధనలు విధించింది.
ఆన్‌లైన్ గేమ్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్‌ను ప్రోత్సహించే యాప్‌లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. వీటికి ప్రచారం చేసే సెలబ్రెటీలపై కూడా చర్యలు తీసుకుంటారు. రియల్ మనీ గేమ్స్‌పై ఈ చట్టం ద్వారా కఠిన నిబంధనలు తెచ్చింది
ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడేవారిని బాధితులుగా పరిగణించాలని ఈ బిల్లులో పొందుపర్చారు. బెట్టింగ్స్ వల్ల లక్షలాది మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూ.కోట్ల నష్టపోతున్నారు.
నిషేధిత డబ్బు ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లను అందించడం వల్ల 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు.
నిషేధిత ఆటలకు సంబంధించిన ప్రకటనలను ప్రచారం చేయడం లేదా ప్రచురించడం వలన గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు
నిషేధిత గేమ్‌లకు సంబంధించిన లావాదేవీలను సులభతరం చేయడం లేదా అధికారం ఇవ్వడం వలన గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు
సెక్షన్ 5, 6, లేదా 7 కింద పునరావృత ఉల్లంఘనలకు అధిక 2–3 సంవత్సరాలు కనీస శిక్షలు, రూ. 50 లక్షల నుండి 2 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్షను పొడిగించే అవకాశముంది.
ఉల్లంఘనలకు కంపెనీలు, డైరెక్టర్లు, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది.
దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ పాన్ కార్డు అనేది అవసరం. ఇది లేకపోతే ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఐటీ రిటర్న్స్ పొందటం వరకు ప్రతీ పనికి దీని అవసరం ఉంటుంది.