AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!

మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!

Samatha J
|

Updated on: Jun 26, 2026 | 6:37 PM

Share

మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించినా, లోతైన దర్యాప్తులో హత్య కోణం బయటపడింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితుడు కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకపోవడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగడ్ కోట వద్ద జరిగిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించినట్లు భావించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో కూడిన హత్య కోణం దాగి ఉందని లోనావాల గ్రామీణ పోలీసులు గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకల కోసం ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతుండగా కేతన్ కాలుజారి పడిపోయాడని తొలుత నమ్మించే ప్రయత్నం జరిగింది. అయితే లోతైన దర్యాప్తులో కేతన్ ప్రమాదవశాత్తు పడిపోలేదని, అతన్ని లోయలోకి తోసివేసి హత్య చేశారనే అనుమానాలు బలపడ్డాయి.సియా గోయల్‌కు కేతన్‌తో వివాహం ఇష్టం లేకపోవడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తన స్నేహితుడి సహాయంతో ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు సియా గోయల్‌తో పాటు ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us