సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్
కొందరు స్టార్ హీరోయిన్లు వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలనుకొని కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటారు. అయితే, వారి ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు, వారు రెట్టింపు వేగంతో సినిమాల్లోకి తిరిగి వచ్చి సత్తా చాటుతారు. నయనతార, త్రిష, నివేదా పేతురాజ్ వంటి నటీమణులు ఇదే బాటలో తమ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత విజయాలను అందుకుంటున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని చూస్తుంటారు. ఇందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పేయడానికి కూడా సిద్ధపడతారు. కానీ, వారి ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు, వారు రెట్టింపు ఉత్సాహంతో, మరింత ఫోకస్‌తో సినిమాల్లోకి తిరిగి వచ్చి అద్భుత విజయాలు సాధిస్తారు. దశాబ్దాలుగా సౌత్ సినిమాల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న నయనతార ఒకానొక దశలో సినిమాలను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుదేవాతో వివాహం తర్వాత నటనకు దూరంగా ఉండాలనుకున్నారు. అయితే, ఆ వివాహం రద్దవడంతో ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. గతంలో కంటే మరింత ఫోకస్డ్గా వర్క్ చేసి టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఇప్పుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. చెన్నై చంద్రం త్రిష కథ కూడా ఇదే విధంగా ఉంది. వరుణ్ మణియన్ అనే నిర్మాతను పెళ్లి చేసుకొని స్థిరపడాలని త్రిష భావించారు. కానీ నిశ్చితార్థం రద్దు అయ్యాక, షార్ట్ గ్యాప్ తీసుకొని ఆమె రెండో ఇన్నింగ్స్‌ను మరింత బలంగా ప్రారంభించారు. యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ.. చిరు మెచ్చిన బంగారం సమంత
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

