AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్

సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి తిరుమల విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కీర్తిసురేష్ దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కీర్తి సురేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెను చూడాలని, ఫోటోలు తీయాలని భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు.

Keerthy Suresh: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్
Keerthy Suresh
Raju M P R
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 1:02 PM

Share

తిరుమలలో కీర్తి సురేష్…

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కీర్తి సురేష్ చర్చించుకున్నారు. పెళ్లయ్యాక మొదటిసారి భర్త ఆంటోనీ తట్టిల్ తో తిరుమలకు వచ్చిన కీర్తి సురేష్ వెంకన్న ను దర్శించు కున్నారు. కీర్తి సురేష్ దంపతుల వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కీర్తి సురేష్ దంపతులు వేద పండితుల ఆశీర్వచనం పొందారు. శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్ లో వేచి ఉన్న కీర్తి సురేష్ ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన కీర్తి సురేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడగా కొందరు ఫోటోలు, సెల్ఫీ లు తీసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్ పెళ్లి అయ్యాక మొదటిసారి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానన్నారు. తాను చేస్తున్న సినిమాల గురించి వివరించారు కీర్తి సురేష్.

రాహు కేతు పూజల్లోనూ…

మరోవైపు రాహుకేతు క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయానికి కూడా కీర్తి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. భర్తతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కీర్తి సురేష్ రాహు కేతు పూజల్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద కీర్తి సురేష్ దంపతులకు స్వాగతం పలికిన అధికారులు స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసారు. మృత్యుంజయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందచేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Follow Us