ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే
దాదాపు ఏడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా. ఎలాంటి అంచనాలు హడావిడి లేకుండా విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా 2018లో విడుదలైన ఈ సినిమాను కేవలం రూ.32 కోట్లతో నిర్మించారు

కొన్ని సినిమాలు చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ హిట్ అవుతుంటాయి. ప్రమోషాన్స్, హడావిడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మూవీ మనదగ్గర చాలానే ఉన్నాయి. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ చాలా సినిమాలు హిట్స్ అందుకుంటున్నాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మొదటి వరుసలో ఉంటుంది. రూ. 32 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని విధంగా రూ. 456కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. క్రైం థ్రిల్లర్ తో పాటు కామెడీ జోడించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు 7 ఏళ్లు అవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.
ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఏం జరుగుతుందా అన్న టెన్షన్స్ ఇస్తుంది. ఊహించని ట్విస్ట్ లు ఆడియన్స్ ను కుర్చీలో నుంచి లేవకుండా చేస్తాయి. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన అంధాధున్. చాలా మంది ఫేవరెట్ మూవీ ఇది. బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో అనిల్ ధావన్, టబు, రాధిక ఆప్టే కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కళ్లులేనివాడి పాత్రలో నటించాడు. సినిమాలో అతను పియానో ప్లేయర్. తన ఫ్రెండ్ రాధికా ఆప్టేకు సంబందించిన ఓ రెస్టారెంట్ లో పియానో వాయిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే డబ్బు మీద ఆశతో అనిల్ ధావన్ ను పెళ్లి చేసుకుంటుంది టబు. ఆ తర్వాత హఠాత్తుగా అనిల్ ధావన్ చనిపోవడంతో అసలు కథ మొదలవుతుంది
ఆ చావు కేసుకు సంబంధించిన ఆరోపణలు ఆయుష్మాన్ ఖురానా పై వస్తాయి. దాంతో సినిమాలో ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు అనిల్ ధావన్ చావుకు , ఆయుష్మాన్ సంబంధం ఏంటి.? అతన్ని ఎవరు చంపారు.? చివరకు ఆయుష్మాన్ దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమాలో చూడాల్సింది. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపింది. రూ. 32 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 456కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీ తెలుగులో నితిన్ హీరోగా మ్యాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. కానీ మన దగ్గర ఈ సినిమా హిట్ అవ్వలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




