AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను బిగ్ బాస్‌కి పంపించండి.. నా టాలెంట్ చూపిస్తా.. ఎస్ఐ రిక్వెస్ట్ తర్వాత జరిగింది ఇదే..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటివరకు తెలుగులో మొత్తం 9 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇటీవల ముగిసిన 9వ సీజన్ విజేతగా కామన్ మెన్ కళ్యాణ్ పడాల నిలిచిన సంగతి తెలిసిందే .

నన్ను బిగ్ బాస్‌కి పంపించండి.. నా టాలెంట్ చూపిస్తా.. ఎస్ఐ రిక్వెస్ట్ తర్వాత జరిగింది ఇదే..
Bigg Boss 10
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2026 | 3:00 PM

Share

బిగ్ బాస్ సీజన్ 10 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే 9 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 10లోకి అడుగుపెడుతుంది. బిగ్ బాస్ 10ను ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. ఈసారి కూడా బిగ్ బాస్ 10 కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వివిధ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్.. తెలుగులోనూ మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 10 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 10కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు.

గత సీజన్ లో సామాన్యులకు పెద్ద పీట వేస్తూ.. అగ్నిపరిక్ష పేరుతో కొంతమందిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఈసారి కూడా అదే తరహాలో సామాన్యులకు సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపనున్నారు. త్వరలోనే అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ 10 అనౌన్సమెంట్ వచ్చిందో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

మమల్ని బిగ్ బాస్ లోకి పంపించండి అంటూ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ 10 లో అవకాశం ఇవ్వాలి అని స్వయంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఎంతో ఆత్మ విశ్వసం జరిగిన వ్యక్తిని, అలాగే నా  ధైర్యాన్ని, ఓర్పును , ప్రతిభను ప్రేక్షకులకు చూపించి అలరిస్తాను. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో సమస్యలను, కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎస్ఐ నాగార్జున రెడ్డి చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది కాస్తా ఏపీ డీజీపీ కంట్లో పడిందని తెలుస్తుంది. అయితే ఈ ఎస్ఐ హౌస్ లోకి అడుగుపెడతాడా అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది మంచి జాబ్ ఉంచుకొని అవసరమా అని, మీరు తప్పకుండా బిగ్ బాస్ లోకి వెళ్తారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చా.? అని కొందరు.. తప్పేముంది గత సీజన్ లో ఇండియన్ ఆర్మీకి చెందిన కళ్యాణ్ వెళ్లలేదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

సీఐ నాగార్జున రెడ్డి వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్