Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశుడి 72వ ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహం కొలువుదీరనుంది. దీనికి సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత విగ్రహాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. సెప్టెంబర్ 14న గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.