విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయత్రి భర్త శ్రీచరణ్ పక్కా ప్రణాళికతోనే ఆమెను హత్య చేశాడని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఆరోపించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు శ్రీచరణ్ 20 మందికి ఫోన్ చేసి సలహాలు తీసుకున్న తర్వాతే పరారైనట్లు తెలిపారు. శ్రీచరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.