AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహంలో ఆలస్యమా.. వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అవుతుందా?

జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను కీడు గ్రహాలు అంటారు. అయితే చాలా మంది వివాహం ఆలస్యం అవ్వడం, ప్రతి సంబంధం ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి కారణం రాహువు గ్రహం కూడా కావచ్చు అంటున్నారు పండితులు. రాహువు చెడు దృష్టి ఉన్న సమయంలోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురు అవుతాయంట. కాగా, ఈ గ్రహదోషాల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 27, 2026 | 11:01 AM

Share
 వివాహ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు సరైన వయసు వచ్చిన తర్వాత వివాహం జరిపిస్తారు. అయితే కొంత మందికి వివాహంలో ఆలస్యం, ప్రతి సారి ఆ సంబంధం విఫలం కావడం, కుటుంబంలో వ్యతిరేకత, అపార్థాలు, అడ్డంకులు, వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. అయితే దీనికి కారణం రాహువు ప్రభావం కావచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  ముఖ్యంగా  దీనికి శుక్రుడు, గురుడు ఏడవ ఇంటిలో కొనసాగడం వంటి గ్రహ దోషాలతో పాటు, జన్మ చక్రంపై కూడా ఇది ఆధారపడి ఉంటుందంట.

1 / 5
అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే? రాహువు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో భైరవ స్వామి కీలక పాత్ర పోషిస్తారు. అందువలన శని వారం లేదా, ఆదివారం భైరవ ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అంతే కాకుండా ఆవనూనె, నల్ల నువ్వులు, పువ్వులను దానం చేయాలి. అలాగే క్రమం తప్పకుండా ఓం భ్రం భ్రీం భ్రూం స:రాహవే నమ: అనే మంత్రాన్ని ప్రతి రోజూ లేదా శని వారం ఉదయం 108 సార్లు జపించాలి.

2 / 5
అలాగే శని వారం పేదలకు నల్ల నువ్వులు, నల్లటి వస్తువులు, నల్ల మినుములు, దుప్పట్లు దానం చేయడం మంచిది. అలాగే కాకుంలకు, నల్ల కుక్కలకు, ఇతర జంతువులకు శనివారం ఆహారం పెట్టడం వలన ఇది రాహువు శక్తిని తగ్గిస్తుందంట. అంతే కాకుండా శని వారాల్లో అసత్యం మాట్లాడటం, చెడు అవాట్లకు దూరంగా ఉండాలంట. ఇలా చేయడం వలన రాహువు చెడు దృష్టి తగ్గిపోతుందంట.

3 / 5
ఒక వేళ రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటే, వీలైతే మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి, రాహు పూజ చేయించడం వలన త్వరగా వివాహం జరగడం జరుగుతుందంట. అంతే కాకుండా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం కూడా చాలా మంచిదంట. లేకపోతే గోమేధం రాహువు రత్నం ధరించడం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us