June 16, 2026
Subhash
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి ఇంధన ధరలు దిగివస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ తగ్గడం, సరిపడా సరఫరా ఉన్న క్రమంలో గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసింది.
కమర్షియల్, పారిశ్రామిక ఉపయోగ నాన్- డొమెస్టిక్ ప్యాక్ట్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్లు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పారిశ్రామిక, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు భారీ ఉపశమనం లభించినట్లయింది.
ఇకపై వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా సిలిండర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వాణిజ్య వినియోగదారులకు (హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు) గ్యాస్ సరఫరాను మునుపటి స్థాయికి (సంక్షోభానికి ముందు స్థాయి) పునరుద్ధరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది
అలాగే బల్క్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా పరిమితుల్లో 50 శాతం సడలింపులు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటితో పాటు వివాహాలు, శుభకార్యాలు, ఇతర ఈవెంనట్లకు కమర్షియల్ సిలిండర్ల కొనుగోలుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంక్షలు తొలగించామని పేర్కొంది.