AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు.. జూన్‌ 30 వరకు వణికించనున్న వానలు!

డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు.. జూన్‌ 30 వరకు వణికించనున్న వానలు!

Samatha J
|

Updated on: Jun 26, 2026 | 6:34 PM

Share

తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం! భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందించింది. జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతంపై హెచ్చరికలు జారీ అయ్యాయి.

తీవ్రమైన ఎండా, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.రాబోయే రోజుల్లో మెజారిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనుండగా, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.తెలంగాణలో ఇప్పటికే ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రైతులు, పశు కాపరులు పిడుగులు, ఈదురు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us