ఇండస్ట్రీ లేడీస్‌కి సేఫ్ కాదు.. పెద్దవాళ్లమని చెప్పుకునేవారే అసభ్యంగా తాకుతారు..
సింగర్ సునీత ఇటీవల సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లోయిటేషన్ ఉందని, మహిళలకు ఇది సురక్షితం కాదని స్పష్టం చేశారు. ఫెమినిజంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, పురుషులు, స్త్రీలు ఎప్పటికీ సమానం కాలేరని ఆమె పేర్కొన్నారు.
తన మధురమైన గాత్రంతో అందరినీ అలరించే సింగర్ సునీత, అప్పుడప్పుడు తన బోల్డ్ మరియు ఓపెన్ స్టేట్‌మెంట్స్‌తోనూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఫెమినిజం గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉండలేరంటూ షాకింగ్ కామెంట్ చేశారు. తాను ఇండస్ట్రీలో విజయం సాధించినప్పటికీ, మహిళలకు ఇది సురక్షితం కాదని ఆమె స్పష్టం చేశారు.ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లోయిటేషన్ నిజంగానే ఉందని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే కొంతమంది కొందరితో గౌరవంగా ప్రవర్తిస్తే, మరికొందరితో పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. పద్దెనిమిదేళ్ల వయసులో తాను కూడా ఇండస్ట్రీలో ఇటువంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం ఇష్టం లేదని అన్నారు. అసలు ఫెమినిజం అంటే ఏంటని ప్రశ్నించిన సునీత, షాకింగ్లీ మగవాళ్లు, ఆడవాళ్లు ఎప్పటికీ సమానం కాలేరని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ రోజుల్లో సిగరెట్ లైట్‌ను టార్చ్ ఫర్ ఫ్రీడమ్ అనుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

