మోదీజీ నా బిడ్డను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని సంబోధించారంటూ చిరు ఎమోషనల్!
ఢిల్లీలో జరిగిన ఓ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ పలకరించారు. ఈ ఆత్మీయ సంబోధనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడికి లభించిన ఈ గౌరవంపై గర్వం వ్యక్తం చేస్తూ, సుమతీ శతక పద్యంతో తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన ఒక జాతీయ సదస్సులో ప్రముఖ నటుడు రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇదే సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, చరణ్‌ను చూడగానే దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు, రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంబోధించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మోదీ తన కుమారుడిని అలా గౌరవప్రదంగా పలకరించడం, న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ కీర్తించడంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆనందాన్ని, గర్వాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.రామ్ చరణ్ తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం అని చిరంజీవి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

