ఏలకులు వీరికి విషంతో సమానం.. పొరపాటున తిన్నారో అంతే!
11 jun 2026
Anand T
ఇలాచీలు మన ఆరోగ్యానికి మేలు చేసేవి అయినప్పటికీ ఇవి.. అందిరికి మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొన్ని గుణాలు జీర్ణరసాలను ఎక్కువగా ప్రేరేపించడం వల్ల కడుపునొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏలకులు తిన్నప్పుడు లేదా వాటి వాసన పీల్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దురద వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తీసుకోవడం ఆపేయాలి.
తీవ్రమైన అసిడిటీ, గుండెల్లో మంట వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఏలకులను తినకపోవడం మంచిదే అని చెబుతున్నారు.
రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు మందులు వాడుతున్న వారు ఏలకులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆ మందుల పనితీరుపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఏలకులు ఎక్కువగా వేసిన స్వీట్లు లేదా ఇతర పదార్థాలను అతిగా తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మనం రోజూ తాగే టీ లేదా వంటల్లో ఒకటి రెండు ఏలకులు వాడటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, ఎవరి శరీర తత్వానికి అనుగుణంగా వారు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
ఏలకులను అధిక మొత్తంలో తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదని. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.