Varalakshmi Sarathkumar : యూటర్న్ తీసుకున్న పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.. వరలక్ష్మీకి సారీ చెప్పుతూ వీడియో.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ డబ్బులు తీసుకుని తమ మూవీ ప్రమోషన్లకు రావడం లేదని ఇటీవల పోలీస్ కంప్లైంట్ సినిమా డైరెక్ట్ర సంజీవ్ మేగోటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై స్పందిస్తూ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే నటి వరలక్ష్మికి సారీ చెప్పారు.

విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ పోలీస్ కంప్లైంట్. డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లకు వరలక్ష్మి దూరంగా ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను అడుకున్నా ఆమె ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు రాలేదని.. డబ్బింగ్ చేయడానికి కూడా సహకరించలేదని అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన వరలక్ష్మి.. తాను సినిమా టీమ్ పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని.. దేనికి పిలిస్తే ఆ ఈవెంట్ లో పాల్గొన్నానని.. తన గురించి డైరెక్టర్ చేసిన కామెంట్స్ గురించి తనకు పూర్తిగా తెయిలదని.. అందుకే అవగాహన లేకుండా స్పందించలేనని స్పష్టం చేసింది. తాజాగా ఈ వివాదం పై మరోసారి స్పందించారు డైరెక్టర్ సంజీవ్ మేగోటి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
పోలీస్ కంప్లైంట్ సినిమాకు వరలక్ష్మీ చాలా సపోర్ట్ చేశారని డైరెక్టర్ సంజీవ్ అన్నారు. ” ఆమె చేయి విరిగినా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆమె కోసమే ఈ కథ రాసుకున్నాను. షూటింగ్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. నన్ను ఆమె ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసింది.. జూన్ 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాము. ఆమెతో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని ప్లాన్ చేశాము. వరలక్ష్మి అందుబాటులో లేకపోవడంతో నా మాటలు కొన్ని తప్పుగా దొర్లాయి. విడుదల అనే కంగారులో అలా మాట్లాడనని అందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తాజాగా డైరెక్టర్ కామెంట్స్ పై వరలక్ష్మి స్పందించారు. డైరెక్టర్ క్షమాపణలను తాను యాక్సెప్ట్ చేస్తున్నాని.. న్యాయం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తాయని .. ఈ విషయంలో తెలుగు నిర్మాత మండలికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
వరలక్ష్మి ట్వీట్..
Apology accepted..justice and truth will always win..thank you to the Telugu producer council for acting so fast on the matter.. @tfpcin thank you Damodhar garu and Prasanna guru..https://t.co/u0H9ic3qNr
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 11, 2026
ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..
