AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో దర్శనం, వసతి, భోజనం ఫ్రీ.. టీటీడీ అదిరిపోయే ఆఫర్.. దరఖాస్తు చేసుకోండిలా..

తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో పనిచేయాలనుకునే వారి నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీరికి ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తోంది. ఇక ప్రొటోకాల్ దర్శన అవకాశం కూడా పొందవచ్చు. ఇందుకోసం టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు..

Tirumala: తిరుమలలో దర్శనం, వసతి, భోజనం ఫ్రీ.. టీటీడీ అదిరిపోయే ఆఫర్.. దరఖాస్తు చేసుకోండిలా..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 11:01 AM

Share

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్పత్రుల్లో వైద్య సేవకులుగా పనిచేసే అవకాశాన్ని డాక్టర్లు, నర్సులు, టెక్నిషీయన్లు, వైద్య సిబ్బందికి అవకాశం కల్పిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసే బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో వీళ్లు పనిచేయాల్సి ఉంటుది. ఈ సేవ చేసేందుకు ముందుకొచ్చేవారికి టీటీడీ అనేక సౌకర్యాలు కల్పించనుంది. నెలలో సగటున వారం రోజుల పాటు సేవలు అందించవచ్చు. వీరికి ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయాలు అందిస్తారు. అంతేకాకుండా వీరికి, వీరి కుటుంబసభ్యులు ప్రొటోకాల్ దర్శన అవకాశం కూడా కల్పిస్తారు. ఇలా వైద్య సేవ చేయాలనుకునేవారికి టీటీడీ అనేక ఉచిత సదుపాయాలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోంచుకోవాలవని వైద్య సిబ్బందికి టీటీడీ సూచిస్తోంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది స్వయంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చేవారు పోర్టల్‌లో తమ అనుభవం, అవార్డులు, ఎలాంటి సేవలు అందిస్తారనే విషయాలతో పాటు ఇతర వివరాలు తెలపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నాక స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల సీఈవోలు వీటిని పరిశీలించి ఎంపిక చేస్తారు. అనంతరం ఏ రోజుల్లో ఆస్పత్రుల్లో సేవలు అందించాలనే తేదీలను ఖరారు చేసి సమాచారం అందిస్తారు. మరిన్ని వివరాలకు 91542 16307, srivarivaidyasevasvims@gmail.com సంప్రదించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఇందుకోసం టీటీడీ ఇద్దరు ఉద్యోగులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. వీళ్లు వైద్య సేవకుల నిర్వహణ పనులను చూసుకుంటారు.

ఎన్నో ప్రయోజనాలు

వైద్య సేవలు అందించేవారికి టీటీడీ అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. వేదిక్ వర్సిటీ, స్విమ్స్ ఆస్పత్రి ప్రాంగణాల్లో వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తోంది. ఇక రవాణా ఖర్చులో కూడా భరిస్తున్నారు. వీరి కోసం భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక ఆఫీస్ కేటాయించారు. ఈ ఆఫీస్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చాలామంది డాక్టర్లు ఈ విధానంలో పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతీ వారం వచ్చి తమ సేవలు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వైద్య సిబ్బంది ముందుకొస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు చెందిన ప్రముఖ డాక్టర్లు కూడా ఒక వారం పాటు వచ్చి ఈ విధానంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులను అంతర్జాతీయ వైద్య బృందం పర్యవేక్షించింది. సర్జరీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేసింది. ఆ సూచన ప్రకారం ఇప్పుడు ఈ రెండు ఆస్పత్రుల్లో పలు మార్పులు చేస్తున్నారు. భక్తులతో పాటు స్థానిక ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నారు.

Follow Us