AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates Today: బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే పడిపోయిన రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. గురువారం ధరలు ఒక్కసారిగా పెరగ్గా.. శుక్రవారం ఢమాట్ అంటూ పడిపోయాయి. పసిడి ధరల్లో వస్తున్న ఈ భారీ హెచ్చుతగ్గులతో కొనుగోలుదారుల్లో కన్‌ప్యూజన్ నెలకొంది. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇవాళ ధరలు ఇలా..

Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 10:05 AM

Share
బంగారం ధరలు గంటల్లోనే తారుమారయ్యాయి. ఉదయం ధరలు పెరగ్గా.. కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. ధరలు ఒకేసారి పడిపోయాయి. గురువారం ధరలు ఒక్కసారిగా పెరగ్గా.. శుక్రవారం ఒక్కసారిగా ఉన్నట్లుండి కుప్పకూలాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,56,170 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,56,490 వద్ద స్థిరపడగా.. నిన్నటితో పోలిస్తే రూ.320 తగ్గిందని చెప్పవచప్చు. ఇక 22 క్యారెట్ల ధర నిన్న రూ.1,43,450 వద్ద స్ధిరపడగా.. ఇప్పుడు రూ.1,43,150గా ఉంది. దీనిపై రూ.300 తగ్గింది.

2 / 5
విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే ఉండగా.. చెన్నైలో ఏకంగా రూ.870 తగ్గింది. చెన్నైలో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,310గా ఉండగా.. నిన్న రూ.1,58,180 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.870 తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,200 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,56,170 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,150గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,56,320గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,300 వద్ద కొనసాగుతోంది.

4 / 5
అటు కేజీ వెండి ధర ఢిల్లీలో శుక్రవారం రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో కూడా కేజీ సిల్వర్ రూ.2.70 లక్షలుగా కొనసాగుతోంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర నిన్న రూ.20 వేలు పెరగ్గా.. ఇవాళ పతనమయ్యాయి.

5 / 5
Follow Us