AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu (Feb 17, 2026): ఫిబ్రవరి 17, 2026 మంగళవారం దినఫలాల ప్రకారం మేష రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమై, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా, అధికారుల విశ్వాసం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం స్థిరంగా ఉండి, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు సాధారణంగా శుభప్రదంగా ఉండనున్నాయి.

Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 17 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కొన్ని దైవ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కొన్ని దైవ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ జీవితంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబంలో చికాకులుంటాయి. పిల్లల నుంచి కొద్దిగా సమస్యలు ఎదురు కావచ్చు. జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి, లాభాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయ పరిస్థితి ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద రోజంతా బాగా సరదాగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. అనుకోకుండా ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇష్టమైన బందుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పెండింగు పనులు కూడా పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక మార్గాలు అనుకూలంగా ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామికి పురోగతి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపా రాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరిస్థితుల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగపరంగానే కాక, కుటుంబపరంగా కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగానే ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, వ్యయ ప్రయాసల కారణంగా బాగా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని బాగా స్వలాభానికి ఉప యోగించుకోవడం జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు పెడతారు. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

Follow Us