AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope: ఫిబ్రవరి 18, 2026 బుధవారం దినఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని, వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలించి, పాత స్నేహితులతో కలయిక సంతోషాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగి, ఆర్థిక-వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ప్రధానంగా అనుకూలంగా ఉండనున్నాయి.

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 18 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. వృషభ రాశి వారికి ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలయిక ఆనందాన్ని నింపుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలయిక ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల్లో ఒకరు చదువుల్లో రికార్డు సృష్టిస్తారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పెద్దల సలహాలు తీసుకుని వ్యాపారాల్లో దూసుకుపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సాయం చేయగల స్థితిలో ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కుటుంబానికి కొంత సమయం కేటాయించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరి స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించి దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తల్లితండ్రుల సేవాభాగ్యం కలుగుతుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఉన్నవారు అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి కొత్త ఆదాయ ప్రయ త్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. కొందరు బంధుమిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ వర్గాల వారితో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగి పోతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో మార్పులు చేపట్టడంలో అవరోధాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి కానీ, వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అవసరానికి ధనం చేతికి అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దగ్గర బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త ప్రయ త్నాలు, కొత్త నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొందరు సన్నిహితుల విషయంలో ఆందోళనకరమైన విషయాలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. మోసపోవడం గానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా బాగా పని ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం, ఖర్చులు దాదాపు సరిసమానంగా ముందుకు సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది పాటి రాబడితో నిలకడగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కూడా కలు సుకుం టారు. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది.

Follow Us
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!