ప్రముఖ నటి శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున తోమాల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయం వెలుపల అభిమానులు, భక్తులు శ్రియను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలా కాలం తర్వాత దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.