AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగువలూ.. మీ అందాన్ని మరింత పెంచే చిట్కా ఇదే!

మగువలూ.. మీ అందాన్ని మరింత పెంచే చిట్కా ఇదే!

Phani CH
|

Updated on: Apr 28, 2026 | 8:11 PM

Share

అందమైన, మెరిసే చర్మం కోసం సహజసిద్ధమైన ఇంటి చిట్కా! టమాటా, తేనెలతో సులభంగా తయారుచేసుకోగలిగే ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన కాంతిని, తేమను అందిస్తుంది. టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు మృతకణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతం చేయగా, తేనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. సున్నితమైన చర్మం కలవారు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి. వారానికి ఒకటి రెండు సార్లు వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి.

అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. మహిళలే కాదు, మగవారు కూడా తమ అందాన్ని పెంచుకోవాలని తపనపడుతూ ఉంటారు. అందుకోసం రకరకాల ప్రొడక్ట్స్‌ను వినియోగిస్తారు. ఇటీవల చాలామంది సహజమైన పద్ధతులతో చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగువల కోసం ఓ మంచి చిట్కాను నిపుణులు సూచిస్తున్నారు. వంటింట్లో ఉండే వస్తువులతోనే సులభంగా ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. టమాటా, తేనెల మిశ్రమంతో చేసే ఈ ఫేస్ మాస్క్ చర్మానికి తేలికపాటి మెరుపును, తేమను అందించడంలో సహాయపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? టమాటాలో ఉండే సిట్రిక్, మాలిక్ వంటి సహజ ఆమ్లాలు, విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మంపై మృతకణాలను సున్నితంగా తొలగిస్తాయి. దీనివల్ల చర్మం కాస్త ప్రకాశవంతంగా, తాజాగా కనిపిస్తుంది. ఇక తేనె చర్మానికి అవసరమైన తేమను అందించి, పొడిబారకుండా కాపాడుతుంది. దీనిలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఒక టీస్పూన్ తాజా టమాటా గుజ్జులో, ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు, చర్మానికి పడుతుందో లేదో తెలుసుకోవడానికి ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం తప్పనిసరి. అంటే, కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని చెవి వెనుక లేదా చేతి లోపలి భాగంలో రాసి 24 గంటల పాటు గమనించాలి. ఎలాంటి దురద, మంట, ఎర్రబడటం వంటివి లేకపోతే ముఖానికి అప్లై చేసుకోవచ్చు. శుభ్రం చేసుకున్న ముఖంపై ఈ ప్యాక్‌ను రాసి, కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన భాగాన్ని వదిలేయాలి. కేవలం 7 నుంచి 8 నిమిషాలు ఉంచుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అనంతరం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పగటిపూట ఈ ప్యాక్ వాడితే, బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. టమాటాలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల సెన్సిటివ్ స్కిన్, పొడి చర్మం ఉన్నవారికి మంట, దురద వంటి సమస్యలు రావచ్చు. ప్యాక్ వేసుకున్నప్పుడు మంటగా అనిపిస్తే వెంటనే కడిగేయాలి. టమాటా లేదా తేనె అలర్జీ ఉన్నవారు, చర్మంపై గాయాలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఈ ప్యాక్ వల్ల ఫలితాలు చాలా నెమ్మదిగా, స్వల్పంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లకు మించి వాడకూడదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత

వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్‌.. తల, మొండెం లేకుండానే..

భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు

వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!

వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..

Follow Us