AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!

వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!

Phani CH
|

Updated on: Apr 28, 2026 | 7:51 PM

Share

ప్రయోగంలో ఆరుగురు వాలంటీర్లు 100 రోజుల పాటు ఒంటరిగా జీవిస్తున్నారు. ఒంటరితనం మానసిక ఆరోగ్యం, పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ అధ్యయనం, భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు వ్యోమగాములను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడానికి కీలక సమాచారాన్ని అందిస్తుంది.

జనాల మధ్య ఉన్నా ఒంటరిగా అనిపించడం ఇప్పుడు చాలామందికి సాధారణమైపోయింది. పని ఒత్తిడి, మారుతున్న జీవన శైలి మనిషిని మెల్లగా ఒంటరిగా మారుస్తున్నాయి. కానీ ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా? ఏదైనా సమస్యలకు దారి తీస్తుందా? ఒంటరిగా ఉండటం వల్ల మనిషి మనస్తత్వం, ఆరోగ్యం, పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడానికి సైంటిస్ట్‌లు ఓ ప్రయోగం చేస్తున్నారు. జర్మనీలో ఆరుగురు వాలంటీర్లను 100 రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక గదిలో ఒంటరిగా జీవించేలా ఏర్పాట్లు చేసారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ‘సోలిస్100’ మిషన్‌లో ఎంపికైన ఆరుగురు వలంటీర్లు ప్రత్యేకంగా నిర్మించిన నివాసంలోకి ప్రవేశించారు. రాబోయే మూడు నెలల పాటు వారు అక్కడే ఉంటూ, కఠిన నిబంధనలను పాటిస్తారు. యూరప్‌లోని వివిధ దేశాల నుంచి 26 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు వలంటీర్లను ఎంపిక చేసారు. వారు నిద్రపోయే సమయాలు, ఒత్తిడి స్థాయులు, బృందంతో కలిసి పనిచేసే తీరు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని గమనిస్తారు. శారీరక మార్పులతో పాటు, వారు నివసించే గదిలోని సూక్ష్మజీవులలో వచ్చే మార్పులను కూడా అధ్యయనం చేస్తారు. వలంటీర్లలో ఒత్తిడి, అలసట, పనితీరు మందగించడం వంటి లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ప్రయోగం ఫలితాలు భవిష్యత్ అంతరిక్ష యాత్రలలో మానవులు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకునేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు. వ్యోమగాముల ఎంపిక, వారికి ఇచ్చే శిక్షణ పద్ధతులు, యాత్ర సమయంలో వారికి అవసరమైన మానసిక మద్దతు వంటివి రూపొందించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సుదూర గ్రహాలకు చేరుకోవడం ఎంత ముఖ్యమో, ఆ ప్రయాణాన్ని మానవులు తట్టుకుని నిలబడటం కూడా అంతే ముఖ్యమని ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది. సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు, భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి చేపట్టే యాత్రల కోసం మానసికంగా, శారీరకంగా వ్యోమగాములను సిద్ధం చేయడంలో ఈ ప్రయోగం కీలకం కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..

ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే

100 అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ.. మెడలో వేసుకున్న వరుడు

అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

Follow Us