AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ శివయ్యే కాపాడాడు.. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. రెప్పపాటులో తప్పించుకున్న ప్రయాణికులు!

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు దోర్నాల అదుపుతప్పి బోల్తా పడింది. ఆ పక్కనే భారీ గుంత ఉండడంతో బస్సు అమాంతం ఆ గుంతలోకి ఒరిగిపోయింది. గమనించిన స్థానిక వాహన దారులు అప్రమత్తమై బస్సులోఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బస్సును తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

ఆ శివయ్యే కాపాడాడు.. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. రెప్పపాటులో తప్పించుకున్న ప్రయాణికులు!
Srisailam Ghat Road Bus Overturn
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 16, 2026 | 7:46 PM

Share

అసలే ఘాట్‌ రోడ్డు… ఆపై బస్సు నిండా ప్రయాణీకులు. ఏమాత్రం తేడా వచ్చినా బస్సు లోయలో పడేదే. అయితే డ్రైవర్‌ సమయస్పూర్తిగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 62 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచాయి. దోర్నాల – శ్రీశైలం ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం కొద్దిసేపు జనాన్ని యమ టెన్షన్‌ పుట్టించింది. ఘాట్‌ రోడ్డులో నెమ్మదిగా వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సుతో కొండను ఢీకొట్టించి నిలువరించాడు. దీంతో బస్సు కొండ పక్క గుంతలో పడి ఆగిపోయింది.

పక్కకు ఒరిగిన బస్సులో ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. ప్రాణభయంతో కిటీకీల నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. అటుగా వెళుతున్న వాహనదారులు బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులను కిటికీల నుంచి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు శ్రీశైలం నుండి డోన్ కు వెళ్తుండగా మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో చింతల దగ్గరకు రాగే ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా, బస్సు లోని 62 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరొక బస్సులో దోర్నాలకు తరలించారు. శ్రీశైలం మల్లన్న దయ వల్లే పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ప్రయాణికులు అంటున్నారు. ఇక ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఘాట్ రోడ్డు లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.