Banana vs Dates: అరటిపండ్లు లేదా ఖర్జూరా.. మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏది బెస్ట్!
మార్నింగ్ మనం తినే ఆహారం అనేది మన డే మొత్తంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం మార్నింగ్ తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. ఈ మధ్య కాలంలో చాలా మంది మార్నింగ్ లేచిన వెంటనే టీ, కాపీ వంటివి తీసుకోవడం మనం గమనించవచ్చు. కానీ నిపుణులు మాత్రం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో అరటి పండు, ఖర్జూరం రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ రెండింటిలో మార్నింగ్ తినేందుక ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన ఆహారంతో మన డేను ప్రారంభించడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది మన మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యం మార్నింగ్ పండ్లను తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి పండు ప్రత్యేకమైనదే.. వీటిని ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఒక్కొటి ఒక్కొరకమైన ప్రయోజనాలను అందిస్తాయి. సాధారణంగా జనాలు ఎక్కవుగా తీసుకునే అరటి పండు, లేదా ఖర్జూరా పండ్ల విషయానికి వస్తే ఈ రెండు కూడా వేర్వేరు పోషక ప్రొఫైల్‌లను అందిస్తాయి. కాబట్టి ఏ పండు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మార్నింగ్ తినేందుకు రెండింటిలో ఏద ఉత్తమమైనదో చూద్దాం.
అరటి వల్ల కలిగే ప్రయోజనాలు
అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అవి గుండె, కండరాల పనితీరుకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఇది చాలా మందికి సులభంగా జీర్ణం అవుతుంది. అయితే దీన్ని తినడం వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది శరీంలోని మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతీయ వచ్చు.అలాగే సహజ చక్కెరలు శక్తిలో అకస్మాత్తుగా పెరుగుదలకు కారణమవుతాయి, ఆ తర్వాత అకస్మాత్తుగా తగ్గుతాయి. సున్నితమైన వ్యక్తులలో, ఇది ఆమ్లత్వం లేదా ఉబ్బరాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇది అందిరికి ఒకే రకమైన ప్రయోజనాలను అందించలేదు
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజాలు
ఖర్జూరాలు ఖాళీ కడుపుతో తినడానికి అత్యంత ప్రయోజనకరమైన పండ్లలో ఒకటిగా పరిగణించబడతాయి, ముఖ్యంగా సాంప్రదాయ, ఆయుర్వేద పద్ధతులలో వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే ఆమ్లత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జీవక్రియను పెంచుతాయి. వాటిలో ఇనుము, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి ఉదయం అలసట లేదా శక్తి లేకపోవడం అనుభవించే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2-3 ఖర్జూర పండ్లను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి పోషకాలు గ్రహించబడతాయి.
రెండింటిలో ఏది తినడం ఉత్తమం
చాలా మందికి, ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం ఆరోగ్యకరమైన ఎంపిక కావచ్చు. ఎందుకంటే అవి జీర్ణక్రియకు సహాయపడతాయి అలాగే దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. అరటిపండ్లు పోషకమైనవి, కానీ జీర్ణ సమస్యలను నివారించడానికి వాటిని తరువాత లేదా ఇతర ఆహారాలతో కలిపి తినడం మంచిది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తీసుకునే పండ్లు, కూరగాయల పరిమాణాన్ని పర్యవేక్షించాలి. ఆమ్లత్వం లేదా ఉబ్బరం ఉన్నవారు అరటిపండ్ల కంటే ఖర్జూరం జీర్ణం కావడానికి సులభం అని భావిస్తారు. అరటిపండ్లు, ఖర్జూరాలు రెండూ ఆరోగ్యకరమైన పండ్లు, కానీ వాటిని తీసుకునే సమయం వేటితో కలిపి తింటున్నామనేది ముఖ్యం. ఖర్జూరాలు సాధారణంగా ఖాళీ కడుపుతో తింటే పోషకమైనవి, కానీ ఉదయం అరటిపండ్లును ఇతర ఆహారలో పార్టు తీసుకోవడం ఉత్తమం.
( Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
