AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ అదుర్స్‌…ఆకట్టుకుంటున్న హెలీకాప్టర్ రైడ్, పారా గ్లైడింగ్‌

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో రెండు రోజుల బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ రాజాబాబు దీనిని ప్రారంభించారు. హెలికాప్టర్, బోట్ రైడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీం, సుమ, రవి వంటి ప్రముఖుల సందడి, రుచికరమైన ఫుడ్ కోర్ట్‌లు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణలు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ అదుర్స్‌...ఆకట్టుకుంటున్న హెలీకాప్టర్ రైడ్, పారా గ్లైడింగ్‌
Pakala Beach Festival 2026
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 14, 2026 | 9:10 PM

Share

ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది… రెండు రోజులపాటు నిర్వహించే ఈ బీచ్‌ ఫెస్టివల్‌ను ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ రాజాబాబుతో కలిసి ప్రారంభించారు… రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, మారిటైం బోర్డు సంయుక్తంగా ఈ రోజు, రేపు బీచ్ ఫెస్ట్ వల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు… టూరిస్ట్‌ల కోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేసి హెలీరైడ్‌ పేరుతో ఆకాశంలో విహరించేందుకు ఏర్పాట్లు చేశారు… హెలికాప్టర్‌ రైడ్‌ కోసం 4 వేలవరకు ధర నిర్ణయించారు… సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక నిర్మించారు… బోట్ రైడింగ్‌, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు… వివిధ రకాల వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు… జబర్దస్త్ టీం సభ్యులతో రాత్రి సందడి చేయనున్నారు…

ప్రముఖ యాంకర్లు సుమ, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు… అతిథులకు విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులు కల్పించారు… చిన్నారులు, యువతీ యువకులు, మహిళలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం జెయింట్ వీల్, రంగుల రాట్నాలు వంటివి ఏర్పాటు చేశారు… ఉదయం 10 గంటలకు ఈరోజు ప్రారంభమైన బీచ్‌ ఫెస్టివల్‌ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది… రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 12 గంటల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు… తొలిరోజు బీచ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఎంపి మాగుంట సరదాగా హెలికాప్టర్‌ రైడ్‌, అలాగే బోట్‌ రైడింగ్‌ చేశారు.

రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలల్లో తొలిరోజు ఈవెంట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి… ప్రధానంగా హెలికాప్టర్‌ రైడింగ్‌, పారా గ్లైడింగ్‌, సముద్రంలో బోట్‌ షికారు, బైక్‌ రైడింగ్‌లతో పాటు గుర్రం, ఒంటెల సవారీలతో పెద్దలు, పిల్లలు తెగ ఎంజాయ్‌ చేశారు… మరోవైపు సీఫుడ్‌ వంటలతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాల్స్‌ భోజనప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి… జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు… ఈ రెండు రోజులు పలు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు… సాయంత్రం బీచ్‌ కబడ్డీ, వాలీబాల్‌, ఇతర క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు… అలాగే పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. జబర్దస్త్‌ యాక్టర్ల స్కిట్‌లు, తెలుగు రాష్ట్రాల్లో పేరున్న గాయకులతో పాటలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ యాంకర్‌ సుమ నేతృత్వంలో ఈరోజు రాత్రి కార్యక్రమాలు సాగనున్నాయి… సాయంత్రం తీరంలో సాగర్‌ హారతి ఇచ్చి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు… రెండో రోజు ఆదివారం శివరాత్రి కావడంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు… ఆ రోజు అర్ధరాత్రి దాటే వరకు కార్యక్రమాలు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు… ఎడెమినిదివేల మంది కూర్చొని కార్యక్రమాలను వీక్షించే విధంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.