AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఇటీవల సోషల్ మీడియాలో పాముల వీడియోలు వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా రోడ్డుపై పాముల గుంపు పోరాడుతున్న దృశ్యం అందరినీ షాక్ చేసింది. ఈ వీడియో AI ద్వారా సృష్టించబడిందా లేదా నిజమైనదా అనే చర్చ జరుగుతోంది. ఏది నిజం, ఏది నకిలీనో గుర్తించడం కష్టంగా మారింది. నెటిజన్లు ఫన్నీ వ్యాఖ్యలు చేసినా, దీని అసలు వాస్తవంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..
Snake Group Fight
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2026 | 4:25 PM

Share

ఇటీవల, సోషల్ మీడియాలో చాలా రకాలైన పాముల వీడియోలు, రీల్స్ షేర్ చేయబడటం మనం చూస్తున్నాము. వాటిలో కొన్ని AI వీడియోలు, కొన్నిసార్లు నిజమైనవి కూడా ఉంటున్నాయి.. ప్రస్తుత AI మహమ్మారితో, ఏది నిజమైనదో, ఏది నకిలీదో గుర్తించడం కూడా కష్టంగా మారింది. వీటన్నిటిలో కొన్నిసార్లు అరుదైన లేదా పెద్ద పాములను చూసినప్పుడు క్యాప్చర్‌ చేసిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌ వేధికగా లక్షలాది మందిని ఆకర్షించాయి. వేల సంఖ్యలో లైకులు, షేర్లు చేయబడుతున్నాయి. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై పాముల గుంపు పొట్లాడుకుంటున్న వీడియో ఒకటి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈ పాముల పంచాయతీ చూసిన ప్రజలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఒకటి, రెండు కాదు. ఏకంగా పాముల గుంపు వీడియో క్లిప్. ఈ వీడియోలో పాముల గుంపు ఒకదానితో ఒకటి పోరాడుతూ రోడ్డుపైకి పరిగెత్తాయి. కానీ ఎన్ని పాములు ఉన్నాయో లెక్కించడం అసాధ్యం అనిపిస్తుంది. ఈ వీడియో మొదట చూసే వారికి గందరగోళంగా అనిపించవచ్చు. కానీ, చూస్తుంటే, అక్కడ సుమారు నాలుగు పాములు ఉన్నాయని తెలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, మనుషులు కొట్టుకుంటున్న తీరుగానే పాములు కూడా వీధికెక్కి పోరాడుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Amarjeet Rajak (@thearajak)

ఈ వీడియో చూసిన నెటిజన్లు పాము కుటుంబ కొట్లాట అంటూ కామెంట్‌ చేశారు. పాపం వారి గొడవను ఆపేది ఎవరూ అని కూడా మరికొందరు కామెంట్‌ చేశారు. ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ పాముల ఫ్యామిలీ గొడవ వీధికెక్కింది అని కూడా ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇది AI వీడియోనా లేదా నిజమా అనేది గందరగోళంగా మారింది. దీన్ని స్పష్టం చేయడానికి, ఇది AI- జనరేటెడ్ వీడియో అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..