- Telugu News Photo Gallery Jupiter transiting in Saturn sign will bring luck to those born in three zodiac signs
వారెవ్వ.. శని రాశిలోకి బృహస్పతి.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక కామన్. గ్రహాల సంచారం 12 రాశులపై దాని ప్రభావం చూపెట్టగా, కొన్ని రాశుల వారికి అదృష్టం, మరికొన్ని రాశులకు అనేక సమస్యలను తీసుకొస్తుంది. అయితే అతి త్వరలో శని గ్రహం సొంత రాశిలోకి బృహస్పతి సంచారం చేయనున్నదంట. దీని వలన మూడు రాశుల వారికి లక్కు కలిసి రానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.
Updated on: Sep 18, 2025 | 4:49 PM

శక్తివంతమైన గ్రహాల్లో శని గ్రహం, బృహస్పతి ఒకటి. అయితే సంపదకు చిహ్నం . అయితే శని గ్రహం సంచారంలో ఉన్న మీన రాశిలోకి నవంబర్ నెలలో బృహస్పతి సంచారం చేయడమే కాకుండా, తిరోగమనం కూడా చేయనున్నదంట. దీని వలన మూడు రాశుల వారికి జాక్ పాట్ తగలనున్నదంట. వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతుందంట.

తుల రాశి : తుల రాశి వారికి శని గ్రహంలోకి బృహస్పతి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుందంట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు రావడంతో సమయాని అన్ని పనులు పూర్తి చేసుకొని చాలా ఆనందంగా జీవిస్తారంట. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. అలాగే ఇంటి నిర్మాణం చేపట్టాలి అనుకునే వారి కల కూడా తీరుతుందంట. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొగిలిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే అన్ని పనులు సమయాని పూర్తి చేసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. మరిన్ని మంచి ఫలితాలకోసం మీ కుల దైవాన్ని ప్రార్థించడం మంచిది.



