- Telugu News Photo Gallery Spiritual photos Chanakya on Wealth: Money Management Tips for a Prosperous Life
Chanakya Niti: చాణక్య చెప్పిన మనీ మేనేజ్మెంట్ సూత్రాలు పాటిస్తే జీవితంలో డబ్బులేని రోజే ఉండదు..
ఆచార్య చాణక్య తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అధ్యాపకుడు.. ఆయన ఆలోచనలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో సాగాలంటే ఆయన చెప్పిన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలు అనుసరణీయం. మనిషి ఆడంబరాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై దృష్టి పెడితే జీవితం స్థిరంగా మరియు సంతోషంగా ఉంటుందని అన్నాడు. నిషి తనకు ఎక్కువ కాలం ఆనందం, భద్రత, గౌరవం లభించే చోట డబ్బు ఖర్చు చేయాలని చెప్పాడు.
Updated on: Sep 17, 2025 | 3:31 PM

ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు. పండితుడు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, సలహాదారుడు మాత్రమే కాదు.. గొప్ప గురువు కూడా. తన జీవితకాలంలో మానవాళి సంక్షేమం కోసం అనేక విధానాలను రచించాడు. దానిని చాణక్య నీతి అని పిలుస్తారు. ఎవరైనా సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటే.. వారికి ఈ నియమాలను పాటించడం ఫలవంతం. ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మీరు ఎక్కడ డబ్బు ఖర్చు చేయాలి ? ఎక్కడ చేయకూడదో కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడూ తప్పు స్థానంలో డబ్బు ఖర్చు చేయరు. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది.

గొప్పల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు: ఆచార్య చాణక్యుడి ప్రకారం ఇతరుల ముందు ప్రదర్శించడానికి లేదా ఆకట్టుకోవడానికి డబ్బును ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. తరచుగా ప్రజలు తమ డబ్బును ఇతరులకు చూపించడానికి వృధాగా ఖర్చు చేస్తారు. తద్వారా సమాజంలో వారికి ఆ సమయంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రదర్శన అనేది కొద్దికాలం మాత్రమే.. అలాంటి ఖర్చులు ఆ వ్యక్తిని తెలియకుండానే ఇబ్బందుల పాలు చేస్తాయి

విద్య, జ్ఞానం కోసం డబ్బు ఖర్చు చేయండి: దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే చోట డబ్బును ఎల్లప్పుడూ ఖర్చు చేయాలని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. విద్య, జ్ఞానం కోసం ఖర్చు చేసే డబ్బు ఎప్పుడూ వృధా కాదు. పిల్లల విద్య అయినా, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం అయినా లేదా పుస్తకాలపై ఖర్చు చేయడం అయినా, ఇవన్నీ భవిష్యత్తును బలంగా చేస్తాయి. అందుకే చాణక్యుడు విద్యను అతిపెద్ద పెట్టుబడిగా భావించాడు.

ఆరోగ్యం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడవద్దు: తరచుగా ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు డబ్బు ఆదా చేసుకోవటానికి చికిత్సను వాయిదా వేస్తారు. అయితే ఆచార్య చాణక్యుడు ఆరోగ్యమే అతిపెద్ద సంపద అని చెప్పేవారు. ఆరోగ్యంగా లేనప్పుడు ఎంత సంపాదించినా ఆ డబ్బు మీకు ఉపయోగపడదు. కనుక సరైన ఆహారం, మందులు, తీసుకోవాలి. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదని చెప్పాడు చాణక్య.

అవసరమైన చోట సహాయం: దానధర్మాలు, సహాయం ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగా చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. పేదవారిని అర్థం చేసుకోకుండా కేవలం పేరు, కీర్తి కోసం డబ్బు ఖర్చు చేస్తే, అది ప్రయోజనం ఉండదు. నిజమైన ధర్మం అంటే సరైన వ్యక్తికి, సరైన సమయంలో సహాయం చేయడమే.

భవిష్యత్ జీవితం కోసం డబ్బు ఆదా చేయడం ముఖ్యం: చాణక్య నీతి ప్రకారం డబ్బు ఈ రోజు మాత్రమే ఖర్చు చేయవలసినది కాదు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం తమ సంపాదనలో కొంత మొత్తం తప్పనిసరిగా పొదుపు చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పేవారు. ఒకరు ఎంత డబ్బు సంపాదించినా దానిలో కొంత భాగాన్ని ఖచ్చితంగా పొదుపు చేయాలి. ఇతర విషయాల్లో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు ఇబ్బంది వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక డబ్బుని పొదుపు చేయడం తప్పనిసరి.

వ్యసనం, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి: మద్యం, జూదం, చెడు సహవాసం కోసం ఖర్చు చేసే డబ్బు ఒక వ్యక్తిని నాశనం చేస్తుందని ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఈ అలవాట్లు ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాదు గౌరవం, సంబంధాలను కూడా నాశనం చేస్తాయి.




