Maa Inti Bangaraam Teaser : యాక్షన్ క్వీన్‌లా సమంత.. సరికొత్త వెర్షన్‌లా మా ఇంటి బంగారం.. టీజర్ అదిరిందిగా..
టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు యాక్షన్ క్వీన్‌లా మారిపోయింది. గతేడాది కొత్త జీవితం ప్రారంభించిన సామ్.. తిరిగి ఫాంలోకి వచ్చింది. మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యింది. చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది అంటూనే ఫుల్ యాక్షన్ మోడ్ లో అదరగొడుతున్నారు.

చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది సమంత. రెండేళ్ల తర్వాత శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు. ఈ చిత్రాన్ని సామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది ఆమె నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సామ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది.. ప్రారంభమైన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి సినిమాతో అడియన్స్ ముందుకు వస్తుంది. ఇందులో సామ్ లుక్స్, యాక్టింగ్ మరోసారి ఆకట్టుకున్నాయి. మా ఇంటి బంగారం సినిమాలో సమంత యాక్షన్ సీక్వె్న్స్ ఉన్నాయని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. బస్సులో సామ్ ఫైట్ మాత్రం నెక్స్ లెవల్ అనిపిస్తుంది. మొత్తానికి చిన్న టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
బేబీ సినిమా తర్వాత సమంత, నందినీరెడ్డి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. నిజానికి వీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నందినీరెడ్డి.. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో హిట్టు కొట్టడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి సమంత కంబ్యాక్ ఒక రేంజ్ లో ఉండేలా ఉందని ఈ టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..




