Jana Nayagan: విజయ్ సినిమాకు తొలగిన కష్టాలు.. జన నాయగన్ విడుదలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి 'జన నాయగన్' చిత్రానికి U/A 16+ సర్టిఫికేట్ జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం జన నాయగన్ నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది . దీంతో విజయ్ చివరి సినిమా అయిన జన నాయగన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ చిత్రానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికేట్ జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మద్రాస్ హైకోర్టు గురువారం జన నాయగన్ నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది . దీంతో విజయ్ చివరి సినిమా అయిన జన నాయగన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత జస్టిస్ పిటి ఆశా ఈ ఉత్తర్వును జారీ చేశారు. చివరి నిమిషంలో సినిమా వాయిదాకు దారితీసిన ప్రధాన అడ్డంకిని తొలగించారు. తీర్పు తర్వాత నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. నివేదికల ప్రకారం జన నాయగన్ రాబోయే రెండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రావచ్చు లేదా జనవరి 14న సంక్రాంతి పండుగ సమయంలో విడుదల కావచ్చు అని సమాచారం.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
వాస్తవానికి జన నాయగన్ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ కారణంగా ఈ మూవీని వాయిదా వేశారు. ఈ విషయాన్ని బుధవారం చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా కంట్రోల్ లో లేని అనుహ్య పరిస్థితుల కారణంగానే తమ సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వస్తుందని తెలిపింది. ఈ సినిమాకు వెంటనే యుఎ సర్టిఫికేట్ జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు సిబిఎఫ్‌సిని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
సెన్సార్ కమిటీలోని ఒక సభ్యుడు ఈ సినిమా గురించి CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత CBFC నుండి సర్టిఫికెట్‌ను నిలిపివేసినట్లు కోర్టుకు తెలిపారు. కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులు ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు తమ అభ్యంతరాలను సరిగ్గా చూడలేదని.. అందుకే తమ నిర్ణయాన్ని రివైజింగ్ కమిటీకి సూచించామని సభ్యుడు పేర్కొన్నారు. జన నాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
