Samantha: అదిరిన సమంత “మా ఇంటి బంగారం” ఫస్ట్ లుక్
సమంత కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం' పోస్టర్ విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో 1980ల నేపథ్యంతో రూపొందిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. జనవరి 9న టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రం సమంత కెరీర్‌లో కీలక మలుపు అవుతుందని అంచనా.
స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి కి సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇప్పటికే నిర్మాతగా ‘శుభం’ సినిమాలో చిన్న కామియోలో కనిపించిన ఆమె నుంచి పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్‌కు తెర దించుతూ సమంత నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం తాజా పోస్టర్‌ను సమంత స్వయంగా విడుదల చేసారు. దాంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘మా ఇంటి బంగారం’. సమంత–నందినీ రెడ్డి కాంబోలో మూడో చిత్రం ఇది. ‘ఓ బేబీ’ తర్వాత ఈ జోడీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా మాస్ పోస్టర్‌లో సమంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించడంతో ఈసారి ఆమె పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో సమంత కనిపించబోతున్నారని తెలుస్తోంది. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’’ అనే క్యాప్షన్‌తో సమంత ఈ పోస్టర్‌ను షేర్ చేసారు. అభిమానులు ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందేమోనని అనుకున్న అభిమానులకు ఈ పోస్టర్ సాలిడ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించడం ఆసక్తికరం. ఈ చిత్రాన్ని సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పై నిర్మిస్తున్నారు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సమంతతో పాటు బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా బలంగా ఉండేలా నందినీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. సినీ వర్గాల అంచనాల ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హై అలర్ట్ ఏ క్షణమైనా పాక్ తీవ్రవాద దాడి
కొనసాగుతున్న బ్లో అవుట్..ఆర్పేందుకు అమెరికా నుంచి నిపుణులు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

