హై అలర్ట్ ఏ క్షణమైనా పాక్ తీవ్రవాద దాడి
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల ముప్పు నేపథ్యంలో నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానిత కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. షాపింగ్‌మాల్స్, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ముంబైలో హై అలర్ట్ ప్రకటించాయి. పాక్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్య జరిగే అవకాశముందని ముంబైలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరాన్ని డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ముంబైలో తనిఖీలు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబంధీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. మరోవైపు అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలయినంతవరకు ఇంటికి పరిమితం కావడం మంచిదని సూచించారు. ముంబైలో భద్రతా బలగాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. షాపింగ్‌మాల్స్, బస్టాండ్లు, దేవాలయాల్లో సోదాలు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్‌తో శోధిస్తున్నారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడాలని యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో ముంబై అలర్టయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొనసాగుతున్న బ్లో అవుట్..ఆర్పేందుకు అమెరికా నుంచి నిపుణులు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు
వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

