ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. వేల సంఖ్యలో బస్సులు నడపనున్నారు. ముందస్తు రిజర్వేషన్లు, పాఠశాల సెలవులతో డిమాండ్ భారీగా పెరిగింది. ఈ బస్సులు జనవరి 8 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటాయి, సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.
సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూళ్లు, పచ్చని పొలాలు, గలగల పారే సెలయేళ్లు, బంధుమిత్రులందరి ఆత్మీయ కలయికలు. ఒకటేమిటీ గత స్మృతులన్నీ నెమరువేసుకోవడం పండగ ప్రత్యేకత. ఆ అనుభూతులను ఆస్వాదించేందుకు పండగలకు సొంతూళ్లకు వెళ్తాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండగకు సొంతూళ్లు వెళ్లేందుకు హైదరాబాద్ జంటనగరాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు తమ ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ పెరిగింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో తెరుచుకోవడంతోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో ఏపీఎస్ఆర్టీసీ విషయానికొస్తే.. సంక్రాంతికి జనవరి 8 నుంచి 14 వరకు 596 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ బస్సులు జనవరి 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో 150 బస్సులను పెంచేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా, తెలంగాణలో ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్‌కు ఈనెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు ఏకంగా 5 వేలకుపైగా స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2500 బస్సులు.. ఏపీకి 3 వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది ఆర్టీసీ. జనవరి 9వ తేదీ నుంచి సొంతూరుకు వెళ్లే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అటు ముందస్తు రిజర్వేషన్ల దృష్ట్యా పెద్ద ఎత్తున బస్సులను TGSRTCఅందుబాటులో ఉంచనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు
వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

