AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదురోను అక్కడ ఉంచారా ?? జడ్జిలు సైతం వణికిపోయే కారాగారం

మదురోను అక్కడ ఉంచారా ?? జడ్జిలు సైతం వణికిపోయే కారాగారం

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 7:46 PM

Share

వెనెజువెలా అధ్యక్షుడు మదురో బ్రూక్లిన్‌లోని కుప్రసిద్ధ మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో బందీగా ఉన్నారు. ఇది హింస, అవినీతి, దారుణమైన పరిస్థితులకు పేరుగాంచిన వివాదాస్పద అమెరికా జైలు. ఆర్. కెల్లీ, డ్రగ్స్ స్మగ్లర్‌లు వంటి ప్రముఖులతో పాటు గ్యాంగ్‌స్టర్‌లు ఇక్కడ ఉన్నారు. మదురో వంటి హై-ప్రొఫైల్ ఖైదీలకు ఈ 'నరకం' లాంటి జైలులో ఎదురవుతున్న సవాళ్లు చర్చనీయాంశం.

వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని అమెరికా బంధించి జైల్లో పెట్టింది. ప్రస్తుతం వారిని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ లో ఉంచారు. ఆర్‌.కెల్లీ, సీన్‌ డిడ్డీ కాంబ్స్‌ వంటి మ్యూజిక్‌ స్టార్‌లు ఉన్న ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైందిగా భావిస్తుంటారు. నిందితులను అక్కడికి పంపించేందుకు కొందరు న్యాయమూర్తులే నిరాకరిస్తారనే ప్రచారం ఉంది. బ్రూక్లిన్‌లోని ఎండీసీని 1990లో ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ 1300 మంది ఖైదీలు ఉన్నారు. వైట్‌కాలర్‌ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితోపాటు గ్యాంగ్‌స్టర్‌లు, మాదకద్రవ్యాల కేసులో నిందితులను ఉంచుతారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురో ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. గతంలో హోండురస్ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెజ్‌ గతంలో ఇక్కడ బందీగా ఉన్నారు. వందలాది టన్నుల కొకైన్‌ను అమెరికాలోకి అక్రమ రవాణా చేశారన్న కేసులో ఆయనకు 45ఏళ్ల శిక్ష పడింది. అయితే, గతేడాది ట్రంప్‌ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మెక్సికోకు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారులు, వెనెజువెలా నిఘా విభాగం మాజీ చీఫ్‌ హ్యూగో కార్వాజల్‌తోపాటు ఆ దేశానికి చెందిన పలువురు కీలక వ్యక్తులు ఇక్కడ బందీలుగా ఉన్నారు. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీకి కనుచూపు మేరలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీన్ని భూమిపై నరకంగా చెబుతారు. ఇక్కడ హింసాత్మక ఘటనలపై ఖైదీలు, వారి న్యాయవాదుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. 2024లో సహచరుల చేతిలో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. నిషేధిత వస్తువులు అనుమతించడం, లంచాలు తీసుకుంటున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. 2019లో విద్యుత్ అంతరాయం కారణంగా వారంపాటు ఖైదీలు చలి, చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇటీవల పరిస్థితులు మెరుగుపర్చామని జైళ్ల మంత్రిత్వశాఖ అంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు

వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు