ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు
ఢిల్లీ గాలిలో NDM-1 సూపర్‌బగ్ ఆనవాళ్లను నిపుణులు గుర్తించారు. యాంటీ-బయాటిక్స్‌కు లొంగని ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వాతావరణ కాలుష్యంతో కలిసి నగరానికి కొత్త ముప్పుగా మారింది. WHO నిర్దేశిత స్థాయికి 16 రెట్లు ఎక్కువగా ఉన్న దీనివల్ల న్యుమోనియా, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. శీతాకాలంలో ఇది మరింత విజృంభించే అవకాశం ఉంది.
మహానగరంలో మాయ పురుగు. ఔను.. దేశ రాజధానికి ఇప్పుడు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పటికే వాతావరణ కాలుష్యం, పొగమంచు కలిసి ఈ శీతాకాలంలో హస్తిన వాసులు శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గాలినాణ్యత తగ్గటంతో రాజధాని ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. ఈ సమయంలోనే న్యూఢిల్లీ మెటల్లో-బీటా-లాక్టోమేస్.. NDM-1 అనే సూక్ష్మజీవి ఆనవాళ్లను ఢిల్లీ గాలిలో నిపుణులు గుర్తించారు. యాంటీ-బయాటిక్స్‌కు సైతం లొంగని ఈ అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా 2008లోనూ ఒకసారి ఢిల్లీని వణికించింది. ఇప్పుడు మళ్లీ ఆ సూక్ష్మజీవి హస్తిన గాలిలో విస్తరిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ స్కాలర్లు.. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ శాంపిల్స్ సేకరించారు. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో అధికంగా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితితో పోలిస్తే దాదాపు 16 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా స్థాయులు ఉన్నట్టు నిపుణుల నివేదిక వెల్లడించింది. ఈ బగ్ న్యుమోనియా, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ గాలిలో క్యూబిక్ మీటర్‌కు 16,000 CFU కంటే ఎక్కువ బ్యాక్టీరియా సాంద్రత ఉంది.శీతాకాలం కనుక, ఈ సూపర్‌బగ్ మరింత విజృంభించే అవకాశం ఉంది. వర్షాకాలం మొదలై వానచినుకులు పడితే తప్ప ఓపెన్ ఎయిర్‌లో ఈ బ్యాక్టీరియా స్థాయి తగ్గే అవకాశం లేదంటున్నారు. కలుషితమైన గాలి, ఇందులో వ్యాపించే ఈ సూపర్‌బగ్‌తో యాంటీమైక్రోబయల్ నిరోధకత-AMR అనే అనారోగ్య సమస్య పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ముప్పులలో ఇదీ ఒకటి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారు జర భద్రం అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

