AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 24 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు...

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 24 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు…

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 8:08 PM

Share

అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీ దక్షిణాఫ్రికా పర్యటనలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 24 బంతుల్లో 68 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. గతంలో ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన వైభవ్, ఇప్పుడు తన 15వ పుట్టినరోజుకు ముందే భారత్‌కు U19 వరల్డ్ కప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ యువ సంచలనం భవిష్యత్తులో టీమిండియాకు గొప్ప ఓపెనర్‌గా మారడం ఖాయం.

గతేడాది ఐపీఎల్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు 2026 ప్రారంభంలోనే సౌతాఫ్రికా పర్యటనలో తన విశ్వరూపాన్ని చూపించాడు. అక్కడ జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లతో 68 పరుగులు చేసి ఊచకోత కోశాడు. విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై ఈ రేంజ్ హిట్టింగ్ చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెడుతున్నారు. ఇది సౌతాఫ్రికాలో వైభవ్‌కు నమోదైన తొలి 50 స్కోరు కావడం విశేషం. వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు సాధించడమే కాకుండా, తన దేశం కోసం ఒక భారీ కానుకను సిద్ధం చేస్తున్నాడు. మార్చి 27న వైభవ్ తన 15వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అయితే ఆ పర్వదినం కంటే ముందే భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో వైభవ్ తన బ్యాట్‌తో గనుక భారత్‌ను విజేతగా నిలబెడితే, అతి చిన్న వయసులో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ ఆడుతున్న విధానం చూస్తుంటే టీమిండియాకు మరో విధ్వంసకర ఓపెనర్ దొరికాడనే భావన కలుగుతోంది. గతేడాది మొత్తం రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన వైభవ్, ఇప్పుడు అదే ఫామ్‌ను 2026కి కూడా మోసుకొచ్చాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న తరుణంలో, వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించనున్నాడు. తన 15వ ఏట అడుగుపెట్టకముందే ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త శకాన్ని లిఖించడానికి ఈ బీహార్ కుర్రాడు సిద్ధమయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు గుడ్​ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు

వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు