కొనసాగుతున్న బ్లో అవుట్..ఆర్పేందుకు అమెరికా నుంచి నిపుణులు
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలోని ఓఎన్‌జీసీ మోరి-5 బావిలో రిపేర్ పనుల మధ్య చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు లీకై ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ నిపుణుల సహాయంతో మంటలను పూర్తిగా నియంత్రించడానికి 7-10 రోజులు పట్టే అవకాశం ఉంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ బావిలో చెలరేగిన మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మోరి-5 బావిలో రిపేర్ పనులు చేస్తుండగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు బయటకు చిమ్మి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని, బావిని చల్లబరిచే పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి నీరు, మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు రెండు లారీల్లో కూలెంట్ ను తీసుకువస్తున్నారు. దీని సాయంతో మంటలు ఆర్పడంలో పురోగతి కనిపిస్తుందని భావిస్తున్నారు. ఇరుసుమండ ప్రాంతంలో సంభవించిన బ్లోఅవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన… బ్లో అవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఓఎన్‌జీసీ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నిపుణులు ఒకటి రెండు రోజుల్లో ఇక్కడికి చేరుకుంటారన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఇరుసుమండలో మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా మంటలు వ్యాపించాయన్నారు. మంటల ఉద్ధృతి క్రమంగా తగ్గి ప్రస్తుతం సాధారణ స్థితిలో సహజ వాయువు మండుతోందన్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి పైకి వస్తుందో కనుగొనే పనిలో నిపుణులు బృందం నిమగ్నమైందని కలెక్టర్ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఢిల్లీ గాలిలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. సోకితే కష్టమేనంటున్న నిపుణులు
వెనిజులా సంక్షోభం.. చమురు ధరలు పెరిగేనా ??
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

