AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే

Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 26, 2026 | 6:38 PM

Share

సమంత మరోసారి వార్తల్లో నిలిచారు.. ఇప్పుడు సినిమాల్లేవు.. షూటింగ్స్ కూడా పెద్దగా చేయట్లేదు కదా ఎందుకు ట్రెండింగ్ అనుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఈమె ట్రెండ్ అవుతున్నారిప్పుడు. దీనికి ఆమె పెళ్ళే కారణం. మరి మ్యారేజ్‌ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా సమంత ఎందుకు ట్రెండ్ అవుతున్నారో చూద్దామా..? సమంత వ్యక్తిగత జీవితం, ఆమె తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.

సమంత మరోసారి వార్తల్లో నిలిచారు.. ఇప్పుడు సినిమాల్లేవు.. షూటింగ్స్ కూడా పెద్దగా చేయట్లేదు కదా ఎందుకు ట్రెండింగ్ అనుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఈమె ట్రెండ్ అవుతున్నారిప్పుడు. దీనికి ఆమె పెళ్ళే కారణం. మరి మ్యారేజ్‌ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా సమంత ఎందుకు ట్రెండ్ అవుతున్నారో చూద్దామా..? సమంత వ్యక్తిగత జీవితం, ఆమె తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆమె తన పేరును మార్చుకునే విషయంపై అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు.. పేరు చివర అక్కినేని చేర్చుకున్నారు.. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనే కాదు.. సినిమాల్లోనూ సమంత అక్కినేనిగానే కనిపించారు. చైతూతో విడిపోయే కొన్ని రోజుల ముందే అక్కినేని అనే ఇంటిపేరు తన పేరు చివర్నుంచి తీసేసి.. రూత్ ప్రభు అంటూ నాన్నపేరును కొనసాగించారు స్యామ్. డిసెంబర్‌లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరిగింది. ఒక ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా తమ పెళ్లి వేడుకను ప్రైవేట్‌గానే ఉంచుకున్నారు. సమంత కెరీర్ పరంగా రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న స్యామ్ కొత్త సినిమా మా ఇంటి బంగారంకు మూలకథ రాసింది రాజే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి సమంత పేరు చివర రూత్ ప్రభు కాకుండా సమంత నిడిమోరు పడనుందనే ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా తెలియాలంటే బంగారం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్ లాక్.. మెగా ఫ్యాన్స్‌కు షాక్

జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు