AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 4:00 PM

Share

అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు బైపాస్ గోశాల సమీపంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వ్యవసాయ పొలాల్లోని సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డవ్వడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు, పశువులను బయటకు వదలలేకపోతున్నారు. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతకు తక్షణమే చిరుతను పట్టి అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు బైపాస్ గోశాల సమీపంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు రికార్డ్ కావడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాలు, గోశాల పరిసర ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పశువులను బయటకు వదిలేందుకు కూడా రైతులు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా గోశాల సమీపంలో చిరుత సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఏ క్షణం ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్

‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు