టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లోని క్లాసిక్ దాబాలో టీ ఇవ్వలేదని యువకులు విధ్వంసం సృష్టించారు. సెల్ఫ్ సర్వీస్ అనడంతో ఆగ్రహం చెందిన నలుగురు యువకులు, స్నేహితులను పిలిచి హోటల్ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆహార పదార్థాలను విసిరేశారు. వినియోగదారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్ సర్వీస్ ఉందని సిబ్బంది చెప్పడంతో, తమకు టీ సర్వ్ చేయడం లేదని ఆగ్రహం చెందిన నలుగురు యువకులు నిర్వాహకులతో గొడవకు దిగారు, ఇదే క్రమంలో తమ స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో మరికొంతమంది యువకులు అక్కడికి చేరుకొని విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. హోటల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి, తిను బండారాలను నేలపై విసిరికొట్టారు. వీధి రౌడీల్లా దాడులు చేస్తుండడంతో వినియోగదారులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసారు. నిర్వాహకులపై భౌతికంగా దాడులు చేసిన వీడియో సిసి కెమెరాలో రికార్డు అయింది..బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్, కారు రిజిస్ట్రేషన్స్ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ..
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

