AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు' హీరోయిన్ ఎమోషనల్

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 3:55 PM

Share

సినిమాల్లో నటీమణులు గ్లామర్ గా కనిపించినా, నిజ జీవితంలో వేధింపులకు గురవుతున్నారు. మౌనీ రాయ్ ఇటీవల ఒక ఈవెంట్‌లో అంకుల్స్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. అసభ్య చేష్టలు, చూపులతో ఆమెను వేధించారు. ఈ ఘటన నటీమణుల భద్రత, గౌరవంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వారికి ఇది మరింత భయంకరంగా మారింది.

సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్‌గా కనిపిస్తారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను అలరిస్తారు. తమ కళతో మరో ప్రపచంలోకి తీసుకెళతారు.. వారికున్న బాధలను దూరం చేస్తారు. ఇవన్నీ నాణానికి ఒక వైపే. ఇక మరో వైపు.. హీరోయిన్లను కనీసం మనుషులుగా చూడరు. ఏదో బొమ్మగా.. ఆట వస్తువుగా థింక్ చేస్తుంటారు కొందరు. కనిపిస్తే కామెంట్ చేస్తారు. సెల్పీల పేరుతో తాకే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో అయితే మరో లెవల్లో వేదిస్తారు. పబ్లిక్ గ్యాథరింగ్‌లు.. ఫంక్షన్స్లో అయినే చూపులతో.. చేతలతో నరకం చూపిస్తారు. సరిగ్గా తనకు కూడా అలాంటి నరకాన్నే కొంత మంది అంకుల్స్ చూపించారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మౌనీ రాయ్‌. తన ట్యాలెంట్‌తో సీరియల్స్‌ టూ సినిమాల స్థాయికి వెళ్లిన మౌనీ రాయ్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఈక్రమంలోనే ఈమె తన ఫ్యామిలీ గ్యాథరింగ్‌ కి వెళ్లింది. అక్కడ తనకు ఎదురైన చేధు ఘటనలపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఈమె. ఎగ్జాక్ట్ గా ఆమె మాటల్లోనే చెప్పాలంటే… “కర్నాల్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్‌ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్‌తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్‌, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్‌ చెండాలమైన కామెంట్స్‌ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్‌ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్‌ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు. అవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి” అంటూ ఎమోషనల్ అయింది మౌనీ రాయ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత